Sunday, January 19, 2025
Homeసినిమాప్ర‌భాస్ హాలీవుడ్ మూవీ?

ప్ర‌భాస్ హాలీవుడ్ మూవీ?

Prabhas- Hollywood:  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్‘ వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ త‌ర్వాత సమ్మ‌ర్ లో స‌లార్ విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ కే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌తో స్పిరిట్ అనే మూవీ చేయ‌నున్నారు. వీటితో పాటు ప్రభాస్, మారుతి దర్శకత్వంలో  ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను కూడా చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్ర‌భాస్ హాలీవుడ్ మూవీ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన నిర్మాణ సంస్థ‌ యూనివర్సల్ స్టూడియోస్ ఓ భారీ హాలీవుడ్ మూవీ కోసం ప్రభాస్ ను సంప్రదించిందట. ఆ మేరకు ప్ర‌భాస్ తో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు సమాచారం. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాహుబ‌లి సినిమాతో త‌న‌కు వ‌చ్చిన క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా ప్ర‌భాస్ కూడా హాలీవుడ్ మూవీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాడ‌ని తెలిసింది.
హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. స్పైడర్ మేన్, బ్యాట్ మేన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరో మూవీస్‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. ప్ర‌భాస్ నిజంగానే హాలీవుడ్ మూవీలో న‌టించ‌నున్నాడా..?  లేదా..?  అనేది తెలియాల్సివుంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇంత కంటే ఆనందం క‌లిగించే న్యూస్ ఏముంటుంది. మ‌రి.. త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్