Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య, పవన్ ఎపిసోడ్ కి ముహుర్తం ఫిక్స్ అయ్యిందా..?

బాలయ్య, పవన్ ఎపిసోడ్ కి ముహుర్తం ఫిక్స్ అయ్యిందా..?

బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్‘ అంటూ టాక్ షోతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఫస్ట్ సీజన్ కంటే.. సెకండ్ సీజన్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవల ఈ టాక్ షోలో ప్రభాస్ పాల్గొన్నారు. బాలయ్య, ప్రభాస్ నుంచి ఇంట్రస్టింగ్ సమాచారం రాబట్టడం.. ఎంటర్ టైన్ చేయడంతో అన్ స్టాపబుల్ టాక్ షోకు మరింత ఆదరణ పెరిగింది. ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా ‘ఆహా’ యాప్ ఓపెన్ చేయడంతో అది క్రాష్ అయ్యిందంటే.. ఈ ఎపిసోడ్ కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత బాలయ్య.. అన్ స్టాపబుల్ టాక్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే.. ఈ టాక్ షోకు పవర్ స్టార్ వస్తారని గత కొన్ని రోజులు నుంచి వార్తలు వచ్చాయి. ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు కానీ.. ప్రచారంలో ఉన్నది నిజం అయ్యింది. పవర్ స్టార్ నిజంగా బాలయ్య టాక్ షోలో పాల్గొనడంతో అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ టాక్ షో షూట్ పూర్తయ్యింది. త్వరలోనే ఆహా ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేసేది ప్రకటించనుంది.

అయితే… సంక్రాంతి కానుకగా జనవరి 13న బాలయ్య-పవన్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రోమో కూడా రెడీ అయిపోయినట్లు సమాచారం. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజైనట్లే అన్‌స్టాపబుల్ లో కొత్త ఎపిసోడ్లు రిలీజ్ చేయడం ఆహా వారికి ఆనవాయితీగా మారింది. జనవరి 13న శుక్రవారం పవన్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్