Saturday, January 18, 2025
Homeసినిమా‘పుష్ప’పై  బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు

‘పుష్ప’పై  బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుంటే.. కథనాయిక రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప సినిమా గురించి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యిందని చెప్పచ్చు. ఇంతకీ బుచ్చిబాబు ఏమన్నారంటే.. ఈ సినిమా చూశాక తన గురువు సుకుమార్‌ మీద అసూయ కలిగిందని చెప్పాడు.

‘పుష్ప’ ఒక్కటే పది ‘కేజీఎఫ్‌’ సినిమాలతో సమానమని, ఈ సినిమా చూశాక అల్లు అర్జున్‌లా మరెవరూ నటించలేరేమో అనిపిస్తోందని అన్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్‌ చేసిన పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయని, ఇప్పటికీ కొన్ని పాటలు తన మెదడులో మార్మోగుతూనే ఉన్నాయని అన్నారు. పుష్ప రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం తెలిసిందే. అయితే.. పుష్ప ఫస్ట్ పార్ట్ ను ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయనున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్