Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ జోడీగా మరోసారి మెరవనున్న ఊర్వశీ రౌతేలా!

మెగాస్టార్ జోడీగా మరోసారి మెరవనున్న ఊర్వశీ రౌతేలా!

బాలీవుడ్ తెరపై గ్లామరస్ బ్యూటీగా ఊర్వశీ రౌతేలాకి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ గా ఆమెకి వచ్చిన అవకాశాలు తక్కువే .. పడిన హిట్లు తక్కువే. అయితే సోషల్ మీడియాలో కనిపించే ఆమె క్రేజ్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. తన హాట్ లుక్స్ తో ఆమె ఫాలోవర్స్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే వెళుతోంది. మంచి ఫిట్ నెస్ తో తన అభిమానుల జాబితాను పొడిగిస్తూనే ఉంది. అలాంటి ఊర్వశి ఈ మధ్యనే సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది.

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ‘బాస్ పార్టీ’ అంటూ సాగే ఈ పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఆ పాట తెచ్చిన పాప్యులారిటీతో ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ‘ఏజెంట్’ .. ‘బ్రో’ .. ‘స్కంద’ సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ ను యూత్ .. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆమె ఇక్కడ  మరింత బిజీ అయింది. బాలకృష్ణ – బాబీ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది.

ఈ లోగానే ఆమె మరోసారి చిరంజీవి సినిమాలో ఆయన సరసన స్పెషల్ సాంగ్ లో మెరవనుందని అంటున్నారు. చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ ‘విశ్వంభర’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగు దశలో ఈ సినిమా ఉంది. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాట కోసం ఊర్వశీ రౌతేలాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఊర్వశీ అందాల సందడి నార్త్ లో కంటే సౌత్ లోనే సక్సెస్ ఫుల్ గా సాగుతోందని చెప్పుకోవాలి. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్