యూఎస్‌ఏకు చెందిన సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలను ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుకు సబ్‌స్ట్రేట్ ముందుకొచ్చింది. ఈ విషయమై ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ తో ప్రాథమిక చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని సిఎం హామీ ఇచ్చారు.
ఈ భేటీలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు.