Sunday, January 19, 2025
HomeసినిమాUstaad Bhagat Singh Songs: 'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్స్ మామూలుగా ఉండవుగా..

Ustaad Bhagat Singh Songs: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాంగ్స్ మామూలుగా ఉండవుగా..

పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది.అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ క్రేజీ కాంబో మూవీ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. అదే… ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

తమిళ హీరో విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ థెరి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, తాజాగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ క్రేజీ హీరోయిన్ ధమాకాలో తన అద్భుతమైన డ్యాన్స్‌తో అందరినీ అలరించింది. అందుకే ఈ సినిమాలో పవన్, శ్రీలీలలతో పర్ఫెక్ట్ మాస్ నంబర్ ప్లాన్ చేయమని అభిమానులు ట్విట్టర్‌లో దర్శకుడు హరీష్ శంకర్ కు సూచించారు. హరీష్ శంకర్ దీనికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఓకే అన్నట్లు గా థంబ్స్ అప్ ఏమోజితో రిప్లై ఇచ్చాడు.

డైరెక్టర్ హరీష్ శంకర్ రెస్పాన్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో ఈ సినిమాలో పాటలు, డ్యాన్సులు మామూలుగా ఉండవు.. ఓ రేంజ్ లో ఉంటాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ భారీ చిత్రం కోసం మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ పై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే… సంక్రాంతికి విడుదల అవుతుంది అని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. పవన్ అభిమానులకు పండగే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్