పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడో పూర్తయ్యింది, సెకండ్ షెడ్యూల్ లేట్ కావడంతో సినిమాపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికంటే ఓజీ ముందుగా రిలీజ్ అవుతుందని కూడా వినిపించింది.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తాజా షెడ్యూల్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెప్టెంబర్ 5 నుంచి తాజా షెడ్యూల్ లో పవన్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ట్విట్టర్ లో.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పోస్ట్ పెట్టడం ఆసక్తిగా మారింది. అంతే కాకుండా తాజా షెడ్యూల్ లోని ఫైట్ సీన్ లో ఉపయోగించే ఆయుధాల ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఉస్తాద్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్లింది. దీంతో ఉస్తాద్ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే ను డైరెక్టర్ దశరథ్ అందివ్వడం విశేషం.