Sunday, January 19, 2025
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాణ సంస్థ మారబోతుందా..?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాణ సంస్థ మారబోతుందా..?

పవన్ కళ్యాణ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో హరీష్ శంకర్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆగిపోవడం వెనుక బలమైన కారణం ఉందని.. ఈ చిత్రాన్ని నిర్మించే సంస్థ మారబోతుందని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పుడో పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారట. అది వడ్డీలు కలుపుకుంటే.. యాభై కోట్లు అవుతుందట. ఈ సినిమా మీద ఇప్పటి వరకు ఖర్చు చేసినవి అన్నీ కలిలి 60 కోట్లు దాటేసిందట. ఇప్పుడు ఈ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ లేదు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకనే మేకర్స్ ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే హరీష్ శంకర్ వేరే సినిమా చేసుకోవడానికి పవన్ పర్మిషన్ ఇచ్చారని… అందుకే రవితేజతో హరీష్ శంకర్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఉస్తాద్ ప్రాజెక్ట్ నే ఏకంగా పీపుల్ మీడియా సంస్థ టేకోవర్ చేసేలా చర్చలు సాగుతున్నాయని టాక్. డీవీవీ దానయ్య నిర్మించాలి అనుకున్న ప్రభాస్-మారుతి సినిమాను పీపుల్ మీడియా సంస్థ ఇలాగే టేకోవర్ చేసింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ను కూడా టేకోవర్ చేసేలా ప్లాన్ జరుగుతుందట. బ్రో సినిమా తర్వాత పీపుల్ మీడియా సంస్థకు పవన్, త్రివిక్రమ్ కు మధ్య అనుబంధం మరింతగా పెరిగిందట. మరో సినిమా చేస్తామని మాట ఇచ్చారట. అందుకనే అనుకుంట ఉస్తాద్ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏది ఏమైనా ఉస్తాద్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో.. ఎప్పుడు థియేటర్లోకి వస్తాడో.. క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్