Saturday, March 14, 2026
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' ప్లాన్ మారిందా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్లాన్ మారిందా?

పవన్ కళ్యాణ్‌ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ సినిమా ఆమధ్య సెట్స్ పైకి  వచ్చి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది.

సెకండ్ షెడ్యూల్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నట్టుగా మేకర్స్ ఆమధ్య అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. పవన్ పొలిటికల్ గా బిజీగా మారడంతో ఇది సాధ్యం కాలేదు.  దీనితో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం  డిసెంబర్ లో రిలీజ్ కాదని, వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల  అని భావించారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి అనే ప్రచారం ఊపందుకుంది. బ్రో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఎన్నికల్లోపు  రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

ఉస్తాద్ కంప్లీట్ చేయాలంటే దాదాపు 90 రోజులు షూటింగ్ చేయాలి. అన్ని రోజులు పవన్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి  సంక్రాంతికి విడుదల కుదరకపోతే.. ఫిబ్రవరి లేదా మార్చిలో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయలనేది సెకండ్ ప్లాన్ అట. దీంతో హరీష్ శంకర్ ఈ సినిమాని ఎంత సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనే దాని పై వర్క్ చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular