Sunday, January 19, 2025
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేకా..?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకా..?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించారు. ఆతర్వాత ‘భీమ్లా నాయక్’ అంటూ మరో సినిమాతో విజయం సాధించారు. ఈ సినిమా కంటే ముందుగా స్టార్ట్ చేసిన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ పీరియాడిక్ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. పవర్ స్టార్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది.

సమ్మర్ లో వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పటి నుంచో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించాలి అనుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రటించింది. అయితే.. అనౌన్స్ చేసి సంవత్సరాలు అవుతున్నప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇటీవల భవదీయుడు భగత్ సింగ్ కాస్తా… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మారింది. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు.

అయితే.. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్, పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి ఈ మూవీ రీమేక్ అని ధృవీకరించారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది విజయ్ నటించిన ‘తేరి’ మూవీకి అధికారిక రీమేక్ అని ఒక టాక్ ఉంది, కానీ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఏ సినిమాను రీమేక్ చేస్తున్నారో ఆనంద్ సాయి చెప్పలేదు. హరీష్ శంకర్ అండ్ టీమ్ మార్పులు చేర్పులు చేస్తున్నారని.. అలాగే పవన్ లుక్స్‌ పై కసరత్తు చేస్తున్నారని  అన్నారు. రీమేక్ మూవీని కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హరీష్ శంకర్ బాగా మార్చగలడు. మరి.. ఈ మూవీని కూడా తెలుగులో మెప్పించేలా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్