Saturday, January 18, 2025
Homeసినిమారామ్ సినిమా టైటిల్ ఇదేనా?

రామ్ సినిమా టైటిల్ ఇదేనా?

ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ మూవీని ఈ నెల 12 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఇందులో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ‘ఉస్తాద్’ అనే టైటిల్ ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ మూవీలో ఉస్తాద్.. ఇస్మార్ట్ శంకర్.. అనే టైటిల్ సాంగ్ ఉంది. అందులోని ‘ఉస్తాద్’ తీసుకుని రామ్ కొత్త సినిమాకి టైటిల్ గా పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ టైటిల్ గరించి ప్రచారంలో ఉన్న వార్తల పై చిత్ర యూనిట్ స్పందించలేదు. త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. రామ్ 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పై రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి.. ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో ఉస్తాద్ కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్