Friday, March 20, 2026
HomeTrending News22న నయనతార హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” రిలీజ్

22న నయనతార హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” రిలీజ్

అందాల తార నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకం పై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన “గేమ్ ఓవర్” కూడా సూపర్ హిట్టయ్యింది.

కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన అంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. ఈ కనెక్ట్ ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular