Sunday, January 19, 2025
Homeసినిమాసీసీసీ ఆధ్వర్యంలో టివి ఆర్టిస్టులకు వ్యాక్సిన్

సీసీసీ ఆధ్వర్యంలో టివి ఆర్టిస్టులకు వ్యాక్సిన్

కరోనా క్రైసిస్ ఛారిటి ఆధ్వర్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. తాజాగా టివి ఆర్టిస్టులకు కూడా వాక్సిన్ అందించే కార్యక్రమం సోమవారం నుండి మొదలైంది.

ఈ సందర్బంగా ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ … సీసీసీ ఆధ్వర్యంలో సినిమా కార్మికులు, ఆర్టిస్టులకు వాక్సిన్ వేసే కార్యక్రమం విజయవంతగా సాగుతుంది. ఇందులో భాగంగా టివి ఆర్టిస్టులకు కూడా ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం వర్తింప చేయాలనీ నేను అన్నయ్య చిరంజీవి గారిని అడిగినప్పుడు అయన వెంటనే ఓకే అన్నారు. ఈ రోజు నుండి టీవీ ఆర్టిస్ట్ అందరికీ వాక్సిన్ ఇప్పిస్తున్నాం. ఈ సందర్బంగా ఈ అవకాశం కల్పించిన అన్నయ్యకు అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు, సీసీసీ, అపోలో వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా అందరు వాక్సిన్ డ్రైవ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను అన్నారు.

టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రముఖ నటుడు వినోద్ బాల మాట్లాడుతూ … మన మెంబర్స్ కి , మన అసోసియేషన్ కు వ్యాక్సినేషన్ అవసరం ఉందని నాగబాబు గారికి చెప్పగానే చిరంజీవి గారితో మాట్లాడి ఈ ఏర్పాటు చేశారని, నాగబాబు, చిరంజీవి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. టివి ఆర్టిస్టులందరు కూడా వ్యాక్సిన్ త్వరగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్