Sunday, January 19, 2025
HomeసినిమాVaishnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ రేపు

Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ రేపు

‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్నారు పంజా వైష్ణవ్ తేజ్.  తన తదుపరి చిత్రంగా ఓ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తోన్న ‘PVT04’ నటిస్తున్నాడు.

మే 15వ తేదీన, సోమవారం సాయంత్రం 4:05 గంటలకు ‘PVT04’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  వైష్ణవ్ తేజ్‌ పాత్రను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ లుక్ ఇంకా విడుదల చేయాల్సి ఉందని, అది ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో శ్రీలీల ‘చిత్ర’ పాత్ర పోషిస్తున్నారు. వజ్ర కాళేశ్వరి దేవి అనే కీలక పాత్రలో అపర్ణా దాస్ నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్