Monday, March 16, 2026
Homeసినిమా'బ్రో' కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది: వైష్ణవ్ తేజ్

‘బ్రో’ కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది: వైష్ణవ్ తేజ్

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందిచారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా మీలాగా మీలో ఒకడిగా ఇక్కడికి వచ్చాను. ఒకటే చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత అనుభవం నాకు లేదు. నా వయసు ఆయన అనుభవం అంత ఉంది. బ్రో టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్. కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నన్ను ఆహ్వానించిన వారందరికీ స్పెషల్ థాంక్స్.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక పాటల ప్రదర్శన, నృత్య ప్రదర్శన, అభిమానుల కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగింది. జీ స్టూడియోస్ తెలుగు హెడ్ నిమ్మకాయల ప్రసాద్, రోహిణి, ఊర్వశి రౌతేలా, యువలక్ష్మి, అలీ రెజా, గణేష్ మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular