Saturday, January 18, 2025
Homeసినిమా'బేబి' నాకు లైఫ్ ఇచ్చింది: వైష్ణవి చైతన్య 

‘బేబి’ నాకు లైఫ్ ఇచ్చింది: వైష్ణవి చైతన్య 

వైష్ణవి చైతన్య ప్రధానమైన పాత్రగా ‘బేబి’ సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా వైష్ణవికి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ‘బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ లో వైష్ణవి మాట్లాడుతూ, తాను ఎంతగానో అభిమానించే విజయ్ దేవరకొండ ఈ ఫంక్షన్ కి రావడం తనకి చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సినిమా తనకి ఒక కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం పలకడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అంది.

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని చెప్పేసి, చాలామంది ట్రై చేయడం లేదు. కానీ నాలాగే వాళ్లకి ఒక రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంది. కాస్త ఆలస్యమైనా ట్రై చేస్తే ఇక్కడ అవకాశాలను పొందవచ్చని చెప్పింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందనీ .. టెన్షన్ పడవలసిన పనిలేదని మేకర్స్ తమకి ముందుగానే చెప్పారనీ, ఫస్టు డే థియేటర్స్ కి వెళ్లినప్పుడు రెస్పాన్స్ చూసి షాక్ అయ్యామని అంది. పెద్ద స్క్రీన్ పై తనని చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పింది.

ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఇంతకాలంగా ఎదురుచూసింది ఇలాంటి ఒక సమయమే కదా అనిపించిందనీ, ఇంతకంటే ఆనందం ఏముంటుందనే ఫీలింగ్ కలిగిందని అంది. ఈ సినిమా రిలీజ్ డేట్ తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందనీ, తనని ఇంత సపోర్టు చేసిన వాళ్లందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది. తనకి ఇంత గుర్తింపు రావడం పట్ల తన పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారనీ, ఇకపై వాళ్లు మరింత ఖుషీ అయ్యేలా చూసుకుంటానని చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్