దేశంలో సుపరిపాలన అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానిగా వారి పాలనా కాలం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. నేడు వాజ్ పేయి 5వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘంగంగా నివాళులర్పించిన పురంధేశ్వరి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు,
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దగ్గరినుంచీ తుది శ్వాస వరాకూ దేశ సేవకే అంకితమయ్యారని చేశారు. ఆర్ ఆర్ ఎస్ ను క్షేత్ర స్థాయినుంచి బలోపెతంచేయడంలో ఆయన కృషి శ్లాఘనీయమన్నారు. పట్టుదల, పోరాట పటిమ విషయంలో నేటి యువత ఆయన స్పూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. తొలిసారి 13 రోజులకే ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సిన తరుణంలో కూడా ఏమాత్రం నీరసించకుండా మరింత ఉత్తేజంతో బిజెపికి నాయకత్వం వహించారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఆంక్షలున్నా వాటిని లెక్కచేయకుండా అణుపరీక్షలు జరిపారన్నారు. దేశం, సంస్కృతి, భాష పట్ల ఆయనకున్న పూజ్య భావం కూడా అందరికీ దర్శమన్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన ఈ తరుణంలో పుస్తక పఠనం పట్ల ఆయనకున్న ఆసక్తి కూడా ఆచరణీయమని పేర్కొన్నారు.