Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ 'వళరి' 

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ ‘వళరి’ 

హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మంచి క్రేజ్ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ … హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలోని కంటెంట్ ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందువలన వారానికో థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతూనే ఉంది. అలా ఈ వారం ‘ఈటీవీ విన్’లోకి ‘వళరి’ వచ్చేసింది. ఈ రోజు ఉదయం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ‘ఈటీవీ విన్’ తన స్పీడ్ పెంచడం కనిపిస్తోంది. అలా క్రితం వారం ‘ఈగల్’ సినిమాను .. ఇప్పుడు ‘వళరి’ వదిలారు.

‘వళరి’ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ తోనే అందరిలో ఆసక్తి మొదలైంది. ట్రైలర్ రిలీజ్ తరువాత ఎప్పుడెప్పుడు ఈ సినిమా అందుబాటులోకి వస్తుందా అనే కుతూహలం మొదలైంది. ‘వళరి’ అనేది ప్రాచీనకాలంలో తమిళ ప్రాంతం వారు ఉపయోగించిన ఒక ఆయుధం పేరు. అప్పట్లో ఆంగ్లేయులను సైతం భయపెట్టిన ఒకే ఒక ఆయుధం ఇది. అలాంటి ఆయుధం గురించిన అంశంతో  .. మరో వైపున ఒక ఫ్యామిలీని వెంటాడే ప్రేతాత్మలతో ఈ కథ నడుస్తుంది.

ప్రాచీనమైన ఆయుధానికీ .. ప్రేతాత్మలకు సంబంధం ఏమిటనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది. వెంకటాపురంలోని ఒక పాత బంగ్లా .. ఆ బంగ్లా పేరు చెబితేనే భయపడే గ్రామస్థులు .. ఆ విషయం తెలిసికూడా ఆ ఇంట్లో దిగిన ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందనేదే కథ. రితికా సింగ్ .. శ్రీరామ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, సుబ్బరాజు .. ఉత్తేజ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్