Saturday, November 23, 2024
HomeTrending NewsVande Bharat: విశాఖ - సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు

Vande Bharat: విశాఖ – సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ ఈ రోజు రావల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్‌ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు అది విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది.

ఈ నేపథ్యంలో ప్రయాణికులు మార్పును గమనించాలని అధికారులు కోరారు. పూర్తి సమాచారం కోసం ఆయా స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని సూచించారు. వందేభారత్ రైలుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ రైలు ఎక్కాలని కోరారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించారు.

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు 20833 నంబర్‌తో, సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు 20834 నంబర్‌తో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తున్నది. ఆదివారం ఈ సర్వీసు అందుబాటులో ఉండదు. ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్