Sunday, January 19, 2025
HomeTrending Newsలోకేష్ పాదయాత్రలో వంగావీటి రాధా

లోకేష్ పాదయాత్రలో వంగావీటి రాధా

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జన సేన పార్టీలో చేరుతున్నట్లు కొంతకాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.  నారా లోకేష్ చేపట్టిన  యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.  వంగవీటి రాధా నేడు యాత్రలో పాల్గొని లోకేష్ తో కలిసి నడిచారు. అంతకుముందు లోకేష్ విడిది చేసిన ప్రాంతానికి చేరుకున్న వంగవీటి…. లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది.

కాగా,  విజయవాడ  తెలుగుదేశం పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న రాధా, పవన్ కళ్యాణ్ సమక్షంలో జన సేన పార్టీలో చేరబోతున్నారని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి.  రాధా వర్గీయులు దీన్ని ఖండించక పోవడంతో  ఈ వార్త నిజమేననే భావన వ్యక్తమైంది.  నేడు లోకేష్ తో రాధా సమావేశమై యాత్రలో పాల్గొనడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్