Saturday, January 18, 2025
Homeసినిమావరలక్ష్మి శరత్ కుమార్ `ఆద్య` ఫస్ట్ లుక్ విడుదల

వరలక్ష్మి శరత్ కుమార్ `ఆద్య` ఫస్ట్ లుక్ విడుదల

Vara-Aadya: వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, హెబ్బాపటేల్ తదితరులు నటిస్తున్న విభిన్న క‌థా చిత్రం `ఆద్య`. వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై S.రజినీకాంత్. P.S.R. కుమార్ (బాబ్జి, వైజాగ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు. అయితే.. శనివారం వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆద్య సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ లుక్ లో ఆమె సరికొత్తగా కనిపించారు. జనవరి 11న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ‌ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్