Sunday, January 19, 2025
Homeసినిమాహను-మాన్‌ లో అంజమ్మగా వరలక్ష్మి ఫస్ట్‌ లుక్

హను-మాన్‌ లో అంజమ్మగా వరలక్ష్మి ఫస్ట్‌ లుక్

Varalakshmi: యువ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ కాంబినేష‌న్లో ఫ‌స్ట్ పాన్ – ఇండియన్ సూపర్ హీరో చిత్రం హ‌ను-మాన్. ఇది భారతీయ తెరపై మొదటి సూపర్ హీరో చిత్రం కానుంది. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్ అంజమ్మగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఆమె పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వరలక్ష్మి వధువు వేషంలో చేతిలో కొబ్బరికాయల గుత్తితో కనిపిస్తుంది. అందంగానే కాకుండా చాలా సీరియ‌స్ గా కనిపిస్తుంది. ఆమె ఒక గుడి దగ్గర కొంత మంది దుండగులను పట్టుకోవడం కనిపిస్తుంది. పోస్టర్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో వరలక్ష్మి పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

హను-మాన్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు కూడా ఏక కాలంలో జరుగుతున్నాయి. తేజ సజ్జా సూపర్ హీరోగా నటించడానికి అద్భుతమైన మేక్ ఓవర్ తో రెడీ అయ్యాడు.  అతను లుక్ కి మంచి స్పంద‌న వ‌చ్చింది. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్