Sunday, November 24, 2024
Homeసినిమాపాత కథనే భారీగా చెప్పిన 'వారసుడు'

పాత కథనే భారీగా చెప్పిన ‘వారసుడు’

Mini Review: విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి ‘వారసుడు‘ సినిమాను రూపొందించాడు. తమిళంలో ‘వరిసు’ టైటిల్ తో ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను నిన్న పలకరించింది. విజయ్ జోడీగా రష్మిక నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా, సంక్రాంతికి పండగ సెంటిమెంట్ తో కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావించారు.

రాజేంద్ర – సుధ (శరత్ కుమార్ దంపతులు)కు ముగ్గురు కొడుకులు. వారిలో చిన్నవాడే విజయ్. బిజినెస్ గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించని తండ్రి తీరు అతనికి నచ్చదు. అందువల్లనే తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ ఉంటాడు. దాంతో తండ్రి చైర్మన్ సీటు కోసం మిగతా ఇద్దరు కొడుకులు పోటీపడుతుంటారు. రాజేంద్రను వ్యాపారపరంగా దెబ్బతీయడానికి జేపీ (ప్రకాశ్ రాజ్) ట్రై చేస్తుంటాడు. ఇద్దరి కొడుకుల బలహీనతలను గమనించిన రాజేంద్ర, మూడో కొడుకును వారసుడిగా ప్రకటిస్తాడు. అప్పటి నుంచి ఏం జరుగుతుందనేది కథ.

తండ్రి ఏ కొడుకునైతే పక్కన పెట్టేస్తాడో .. అతనే ఆ కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని పరిస్థితులను చక్కదిద్దడమనే కథతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. చిన్న చిన్న పాత్రలకి కూడా ప్రభు .. సుమన్ .. ఎస్.జె. సూర్య వంటి స్టార్స్ నుతీసుకోవడం చూస్తే, పాత కథనే గ్రాండ్ గా చెప్పడానికి ట్రై చేసినట్టుగా అనిపించక మానదు. అప్పటికీ డాన్సులలో .. ఫైట్లలో తన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్ వైపుకు లాక్కురావడానికి విజయ్ గట్టిగానే ప్రయత్నించాడు. సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. రష్మిక విషయానికొస్తే ఆమె పాత్ర నిడివి మాత్రమే కాదు, గ్లామర్ పరంగా కూడా తక్కువగానే కనిపించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్