Sunday, January 19, 2025
Homeసినిమా'వారసుడు' మెప్పిస్తాడా..?

‘వారసుడు’ మెప్పిస్తాడా..?

‘వారసుడు’. విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రమింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. రష్మిక నటించింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. అలా చేస్తే.. చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు దొరకని పరిస్థితి. అందుచేత దిల్ రాజు పై ఒత్తిడి పెరిగింది. ఆఖరికి దిల్ రాజు తగ్గాల్సివచ్చింది.

వారసుడు చిత్రాన్ని తమిళ్ లో జనవరి 11న విడుదల చేసి.. తెలుగులో జనవరి 14న విడుదల చేస్తున్నారు. తమిళ్ లో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. ఈ సినిమా రిలీజైన రోజునే అజిత్ మూవీ కూడా రిలీజ్ కావడంతో అక్కడ కూడా థియేటర్లు పంచుకోవాల్సి వచ్చింది. అందుచేత విజయ్ సినిమాలకు ఫస్ట్ డే వచ్చేంత కలెక్షన్ ఈ సినిమాకి రాలేదు. అయినప్పటికీ టాక్ బాగుండడంతో రోజురోజుకు కలెక్షన్స్ బాగుంటాయని నమ్మకంగా ఉన్నారు. తెలుగులో రిలీజ్ డేట్ దగ్గరపడడంతో దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి వారసుడు మూవీ పై ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పారు.

ఇంతకీ ఏం చెప్పారంటే… వారసుడు సినిమా చూసి తమన్, వంశీ ఏడ్చేశారు. సినిమా చూసిన వాళ్లు అయితే.. నిలుచుని చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో మా బాధంతా మరచిపోయాం. 50 సినిమాల ప్రయాణంలో ఎలా ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సినిమా వారసుడు అంటూ దిల్ రాజు తన మనసులో మాటలను బయటపెట్టారు. తమిళ ఇండస్ట్రీకి వెళ్లి బ్లాక్ బస్టర్ కొట్టి ఇక్కడకు వస్తున్నాం. చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా వారసుడు చిత్రం నచ్చుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్