Sunday, January 19, 2025
Homeసినిమావరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి

వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి

Induvadana coming:
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై MSR (ఎం శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత ‘ఇందువదన’ సినిమాతో వరుణ్ సందేశ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు ఎమ్మెస్సార్.

ఈ సినిమా టీజర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ ‘‘ఇందువదన’ సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

Also Read : వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్