Wednesday, March 26, 2025
Homeసినిమావరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ అనౌన్సుమెంట్..

వరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ అనౌన్సుమెంట్..

సోనీ పిక్చర్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వైమానిక దాడుల నేపథ్యంలో .. భారీ యాక్షన్ దృశ్యాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.కెరియర్ పరంగా వరుణ్ తేజ్ కి ఇది 13వ సినిమా. ఇందులో ఆయన IAF ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కూడా ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్