Saturday, January 18, 2025
Homeసినిమాసందేశాత్మకంగా ‘రిపబ్లిక్’ సాంగ్

సందేశాత్మకంగా ‘రిపబ్లిక్’ సాంగ్

మెగా హీరో సాయి తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇన్నాళ్లు యూత్ ఫుల్ ఎంటెర్టైనర్లు చేస్తూ వచ్చిన సాయి తేజ్ మొదటిసారి చేసిన పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా మీద తాను చాలా ఆసక్తిగా ఉన్నట్టు, దేవ కట్ట కథను చాలా బాగా రాసినట్టు తేజ్ ఆమధ్య చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో “యువరానర్.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజకీయ నాయ‌కులు, శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బబద్ధంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది, ప్ర‌భుత్వం అవుతుంది, అదే అస‌లైన రిప‌బ్లిక్” అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ సినిమా మీద మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది.

జె. భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా కాగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆదివారం (జూలై 11) ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఎయ్‌ రారో.. ఎయ్‌ రారో‌.. అంటూ మొదలైన ఈ పాటను గానా ఆఫ్‌ రిపబ్లిక్‌ గా మేకర్స్‌ పరిచయం చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ పాటకు రెహమాన్‌ లిరిక్స్‌ అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, ధనుంజయ్‌, పృథ్వీ చంద్ర, హేమంత్‌, ఆదిత్య అయ్యంగార్‌ ఆలపించారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే రిపబ్లిక్ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్