Friday, March 20, 2026
Homeసినిమామరో మాస్ సాంగుతో దుమ్మురేపేసిన 'వీరసింహారెడ్డి'

మరో మాస్ సాంగుతో దుమ్మురేపేసిన ‘వీరసింహారెడ్డి’

‘వీరసింహా రెడ్డి’ పై అంతకంతకూ అంచానాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో సాంగ్ మాస్ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ‘మాస్ మొగుడొచ్చాడే’ అంటూ సాగే మరో మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య  శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. బాలయ్య కి ఉన్న ఇమేజ్ ను .. ఆయన సినిమాల నుంచి అభిమానులు ఆశించే కంటెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ పాటను రాశారు.

గతంలో బాలయ్యకి  కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ‘మనో’ను పిలిపించి మరీ ఈ పాటను పాడించడం విశేషం. ఆయనతో పాటు రమ్య బెహ్రా స్వరం కలిపింది. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు పాటకి తగినట్టుగా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ లో ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చేలా ఉన్నాయి. పండగకి తగినట్టుగా పంచెకట్టుతో పాటు, మోడ్రన్ డ్రెస్ లలోను బాలయ్య మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఆయన జోడీగా శ్రుతి హాసన్ తనదైన జోరు చూపించింది.

‘అఖండ’ సంచలనం తరువాత బాలయ్య .. ‘క్రాక్’ హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేసిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్యకి బాగా అచ్చొచ్చిన రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోని కథ ఇది. అలాగే సంక్రాంతి రిలీజ్ కూడా ఆయనకి కలిసొచ్చిన సెంటిమెంటే. ఇప్పటికే ఆల్బమ్ హిట్ కావడం వలన ఈ సినిమా తప్పకుండా రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular