Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్

బాల‌య్య మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంతో.. మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో చేస్తున్న మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.  మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవ‌ల ట‌ర్కీలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.  షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ప్ర‌క‌టించ‌లేదు.ఇది వరకే చాలా రకాల టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.  చిత్ర యూనిట్  ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆ మధ్యలో ‘రెడ్డి గారు’… ఆ తర్వాత ‘జై బాలయ్య‘ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే.. దర్శకుడు గోపీచంద్ మాత్రం ఆ రెండు టైటిల్స్ కాకుండా వింటేజ్ బాలయ్యను ఫ్యాక్షనిజంలో చూపిస్తున్నాడు కాబట్టి టైటిల్ కూడా అదే తరహాలో ఉండాలి అని ఆలోచించారట. ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని ఇటీవల బాలయ్యతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ కి బాల‌య్య కూడా పాజిటివ్ గా స్పందించార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే… జనవరి 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యార‌ట‌. మ‌రి.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

Also Read: కృష్ణంరాజు కుటుంబానికి బాలకృష్ణ పరామర్శ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్