Thursday, March 19, 2026
Homeసినిమావిశేషంగా ఆకట్టుకుంటున్న'మార్క్ ఆంటోని' 'వీరభద్ర స్వామి' లిరికల్ సాంగ్

విశేషంగా ఆకట్టుకుంటున్న’మార్క్ ఆంటోని’ ‘వీరభద్ర స్వామి’ లిరికల్ సాంగ్

కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌తో పాటు టాలీవుడ్ లో కూడా సుప‌రిచిత‌మై త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విశాల్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌ పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో హీరో ఎస్.జె.సూర్య నటిస్తుండగా విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మొదటి మూడు సింగిల్స్ కు భారీ స్పందన లభించింది. ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా, ఐ లవ్ యూనే, అమ్మ అను మంత్రము లిరికల్ సాంగ్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేయగా ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘’భువికి తరలిరా వీరభద్రుడా.. మహిమ చూపరా ప్రళయ రుద్రుడా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్స్  ఆకట్టుకునేలా ఉన్నాయి.

లిరిసిస్ట్ భువన చంద్ర  రాసిన లిరిక్స్, హేమ చంద్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి.  ఈ పాట కథానాయకుడి ఆవేశాన్ని చాటి చెప్పేలా ఉంది, పాటలో కొన్ని హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. వీరభద్రుడిని ప్రార్థిస్తూ సాగిన ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఆద్యంతం సాగింది. ఈ సాంగ్ విడుదల చేసిన కాసేపట్లోనే  వైరల్ గా మారింది. ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ చార్ట్ బస్టర్ కానుంది. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular