Sunday, January 19, 2025
Homeసినిమాప‌వ‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మ‌ళ్లీ ఆగిందా?

ప‌వ‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మ‌ళ్లీ ఆగిందా?

Veera “Mullu”: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథతోనే క్రిష్‌ హరి హర వీరమల్లు అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న ఇస్మార్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. దాదాపుగా 60 శాతం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడింది. చాలా గ్యాప్ తరువాత తిరిగి షూటింగును స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేశారు.

ఈ నెల 6 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న 6న తాజా షెడ్యూల్ స్టార్ట్ కాలేదు. ఈ నెల 8వ తేదీన కొత్త షెడ్యూల్ షూటింగు మొదలు కానుందని స‌మాచారం. భారీ బడ్జెట్ తో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్వ‌ర‌వాణి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాతనే మరో ప్రాజెక్టు పైకి వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ సినిమాని ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. మ‌రి.. ఇప్ప‌టి నుంచైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటుందేమో చూడాలి.

Also Read : పవన్ ఒక పేరు కాదు… బ్రాండ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్