Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆవుపాలు కాదు ఆలూ పాలు

ఆవుపాలు కాదు ఆలూ పాలు

Vegans: వేగనిజం వేగంగా విస్తరిస్తోన్న కాలమిది. అందుకు తగ్గట్టుగా ఆహారం, ఉత్పత్తులు తయారవుతున్నాయి. వీగన్లు జంతువులనుంచి వచ్చే ఏ ఉత్పత్తులూ తినరు. మొక్కల నుంచి వచ్చే ఆహారమే తీసుకుంటారు. సాంప్రదాయ శాఖాహారులు పాటించే నియమాలు వీరూ పాటిస్తారు. కొంచెం ఎక్కువే కూడా. మాములుగా దొరికే పాలు, పెరుగు వీళ్లకు పడవు. మరి ఆకులు,అలములు అంటే బలం ఎలాగా అనుకోవచ్చు. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ వంటి సెలెబ్రిటీలు వేగన్ లే. జెనీలియా అయితే వేగన్ ఉత్పత్తుల తయారీలో ఉంది. ఇంతకీ వీళ్ళు ఏం తింటారు అంటారా? ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు. మొక్కలనుంచి లభించే పప్పుధాన్యాలు అన్నీ తింటారు. అంతే కాదు బాదం, వేరుశనగ, కొబ్బరి నుంచి తీసిన పాలను వాడతారు. పెరుగు కూడా తయారు చేస్తారు. ఈమధ్య ప్రముఖ కంపెనీలు వీగన్ బర్గర్లవంటివి తయారు చేస్తున్నాయి. ప్రపంచంలో వీరి సంఖ్య పెరుగుతోంది. మాంసం లాగే ఉండే వంటకాలు కూడా చేస్తున్నారు. ఇక వీగన్ గా ఉండటంలో లాభాలేంటో చూద్దాం

  • బరువు అదుపులో ఉంటుంది
  • ఆరోగ్య సమస్యలు తక్కువ
  • పర్యావరణానికి ఎంతో మేలు
  • గుండెజబ్బులు, ఇతర వ్యాధులు రావు
  • మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉంటారు

ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు వీగనిజం పట్ల మక్కువ చూపుతున్నారు. అందుకే వీరి ఆహారం పట్ల పరిశోధనలు ఎక్కువే. తాజాగా ఆలూ నుంచి తయారుచేసే పాలు వీరి జాబితాలో చేరాయి. ప్రముఖ స్వీడన్ కంపెనీ ‘డగ్’ ఆలుగడ్డల నుంచి పాలను తయారుచేస్తోంది. తాజాగా యూకే లో ప్రవేశపెట్టిన పాలకు మంచి ఆదరణ లభిస్తోంది. సోయా, బాదం పాల కంటే ధర కూడా తక్కువే. పోషకాలు ఎక్కువ. పర్యావరణ హితం.  దాంతో వేగన్లు కూడా ఆలూ పాలు కొంటున్నారు.

ఆలుగడ్డలు ప్రపంచవ్యాప్తంగా పండుతాయి. దాంతో పాల తయారీ సులభం కాబట్టి ముందుముందు మరింత మార్కెట్ ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా తమ మెనూలో  మరో పదార్థం చేరినందుకు  వేగన్లు సంబరపడుతున్నారు.

-కె. శోభ

Also Readకూటి కోసం కోటివిద్యలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్