Saturday, July 27, 2024
HomeTrending Newsనిరుద్యోగులు చనిపోతుంటే జన్మదిన వేడుకలా?

నిరుద్యోగులు చనిపోతుంటే జన్మదిన వేడుకలా?

Revanth Reddy Police Complaint : 

అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులు తను చేసిన ఫిర్యాదుకు ఇవాళ్టి ఉదయం వరకు FIR నమోదు చేయలేదన్నారు. FIRలో నమోదు చేసిన సెక్షన్స్ సంతృప్తికరంగా లేవని హైదరాబాద్ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు పెట్టిన సెక్షన్స్ తో తన ఫిర్యాదు నిరుగారిపోతోందని, సెక్షన్స్ సంతృప్తికరంగా లేవు కాబట్టే మళ్ళీ ఫిర్యాదు చేసానని స్పష్టం చేశారు. కొత్త fir లో బలమైన సెక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల వల్ల ఫిర్యాదు రూపమే మారిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులు ఎఫ్.ఐ ఆర్ నమోదు చేశారు. ఇది ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్ లాగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి మేరకు ఇలాంటి నామమాత్ర కేసులు నమోదు చేశారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విదంగా మాట్లాడిన హిమంత్ పైన బలమైన కేసులు నమోదు చెయ్యాలని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని అస్సాం ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు కేసును నిరుగారిస్తే- న్యాయస్థానం లో కొట్లాడుతామన్న రేవంత్ రెడ్డి వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మృత్యువాత పడుతుంటే- కేసీఆర్ పిల్లలు మాత్రం కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులు జరుపుతున్నారని విమర్శలు సంధించారు. కరొనాతో సమాజం అంతా దుఃఖంలో ఉంటే మూడు రోజులు జన్మదిన వేడుకలు ఎలా చేసుకుంటారు? 17వ తేదీన యూత్ కాంగ్రేస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గాడిద కు జన్మదిన వేడుకలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా 1లక్ష పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యూపీలో మేలు చేయడానికే కేసీఆర్ సుపారి తీసుకోని మాట్లాడుతున్నారని, మూడో కూటమి వస్తే యూపీఏ కూటమి బలహీనపడి- ఎన్డీఏ కూటమి బలపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ నుంచి సుపారి తీసుకున్న సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ తో ఉన్న కూటములను చీల్చడానికే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, దేశం- తెలంగాణ సమాజం ముందు కెసిఆర్ దోషిగా నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Also Read : ఎవరు కొడుకు? ఎవరు తండ్రి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్