Friday, November 22, 2024
HomeTrending Newsవెలిగొండ రెండో టన్నెల్ పనులు పూర్తి

వెలిగొండ రెండో టన్నెల్ పనులు పూర్తి

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరే దశలో మరో ముందడుగు పడింది. వెలిగొండ కల సాకారమయ్యేలా ఈ ప్రాజెక్టు  రెండో టన్నెల్ పనులను నిర్మాణ సంస్థ మెఘా సంస్థ నేడు పూర్తి చేసింది.  2019, మే 30 నాటికి 7.698 కిమీల తవ్వకం పనులు పూర్తి కావాల్సి ఉండగా మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసెలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసింది. దుర్భిక్ష ప్రాంత రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వెలిగొండ పనులను వేగవంతం చేసింది.

శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి గాకా, వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగగర్‌ రిజర్వాయర్‌ మహానేత వైఎస్‌ హయాంలోనే పూర్తికావడం గమనార్హం. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమలసాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా  ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరా తో పాటు ఈ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి దీని ద్వారా మార్గం సుగమం కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్