Saturday, January 18, 2025
Homeసినిమావెంకీ 76వ సినిమా పట్టాలెక్కేది ఆ రోజునే!

వెంకీ 76వ సినిమా పట్టాలెక్కేది ఆ రోజునే!

వెంకటేశ్ 75వ సినిమా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ .. యాక్షన్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. శ్రద్దా శ్రీనాథ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చింది. బాలీవుడ్ విలన్స్ తో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

ఈ నేపథ్యంలో వెంకటేశ్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది. వెంకటేశ్ తన 76వ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నారనే టాక్ బలంగా వినిపించింది. అది నిజమేననే సంకేతాలు కూడా అందుతూనే వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఖాయమైపోయింది. మహాశివరాత్రి రోజున ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీమ్ ఆ రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించనుందని చెబుతున్నారు. అందువలన ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు ఆ రోజున తెలిసే అవకాశాలు ఉన్నాయి. గతంలో వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న మూడో ప్రాజెక్టుపై అభిమానుల్లో అప్పుడే అంచనాలు మొదలైపోయాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్