Saturday, January 18, 2025
Homeసినిమాఉగాది రోజున పట్టాలెక్కతున్న సంక్రాంతి సినిమా!

ఉగాది రోజున పట్టాలెక్కతున్న సంక్రాంతి సినిమా!

ఒకప్పుడు సంక్రాంతికి తమ సినిమాలు తప్పకుండా బరిలో ఉండేలా చూసుకుంటూ సీనియర్ హీరోలు పోటీపడ్డారు. ఆ తరువాత కాలంలో సంక్రాంతి సమయానికి తమ సినిమాలు సిద్ధంగా ఉంటే బరిలోకి దిగడం మొదలైంది. కానీ మళ్లీ ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దిగడానికి సీనియర్ స్టార్ హీరోలు .. యంగ్ హీరోలు కూడా పోటీపడుతున్నారు. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలైనా వసూళ్లపై పెద్దగా ప్రభావం ఉండదనే విషయంలో క్లారిటీ రావడంతో, ఎవరికి వారు ధైర్యంగా బరిలోకి దిగిపోతున్నారు.

హీరోలు .. దర్శకులు తమ సినిమా సంక్రాంతికి వస్తుందనే విషయాన్ని ముందుగానే చెప్పేస్తున్నారు. అలా ప్రకటించినవారిలో అనిల్ రావిపూడి కూడా కనిపిస్తున్నాడు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఉగాది రోజున మొదలుపెట్టాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఉగాది రోజున లాంఛనంగా షూటింగును ప్రారంభించి, మే నెల నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళతారని సమాచారం.

వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరి కథానాయికలు సందడి చేయనున్నారు. ఆల్రెడీ మీనాక్షి చౌదరిని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రధానమైన కథానాయికగా త్రిషను తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిస్తోంది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సంక్రాంతి సినిమా, ఉగాది రోజున మొదలవుతుండటం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్