Raghavendra Rao appeal:
ఇది ఆరేసుకోబోయి పొరపాటున పారేసుకున్నది కాదని అందరికీ తెలుసు. పారేసుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఆరేసుకున్నట్లు స్పష్టంగా తెలుసు.
పారేసుకోవాలనారేసుకున్నారు
హరి!
ఆరేసుకోవాలనేడేసుకున్నారు
హరి?
మా జేబు దోచింది కొండగాలీ!
మీరు కొంటె చూపు చూస్తూనే చలి..చలి!
మీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ!
మాకు ఉడుకెత్తిపోతుందీ హరి..హరి!
మా జేబు అందాలు మీ కన్నులా..దోచేసుకోనీ సందేవెళ..
ఈ పూట మా రాత మీ పాలిట పొర్లిపోనీ తొలి పొంగులా..
మీ చూపు సోకాలి..
మా ఊపిరాగాలి…
మీ మంట మా చేదు చలిమంటకావాలి!
మీరింక పిండుకోవాలి
మేము కాగిపోవాలీ..
మీ మాయలో మేము
మాడిపోవాలి!
మీ ఒంపులో సొంపులో కలెక్షన్లు
మీ చూపులో రావులే హరివిల్లు
మీ రాక…మా ఖర్చుల ఏరువాక..
మీ రాక నీలిమబ్బు మా కేక!
మే వేగి పోవాలి..
మేమూగిపోవాలి..
చెలరేగి ఊహల్లో ఊరేగి పోవాలి!
ఈ పాడు పులకింతలే మా బాధ కావాలీ..
ఈ ఏడుపు ఏడుస్తూ మిము చేరుకోవాలి!
మీరు కొంటె చూపు చూస్తేనే…మాకు…
వినోదం చలి
వినోదం వణుకు
వినోదం భయం
వినోదం ఆందోళన
వినోదం దిగులు
వినోదం కలవరం
వినోద అభాస
వినోదం రసాభాస
అవును…నిజమే.
బొడ్డు మీద కాచి దొర్లిన పళ్ల సాక్షిగా నిజమే…రాఘవేంద్ర రావు బి ఏ గారూ!
ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్లాక్, వైట్…ఏదయినా మమ్మల్ను దోచుకోవడానికి మీకున్న అధికారాన్ని ఏ ప్రభుత్వాలూ, ఏ వ్యవస్థలూ అడ్డుకోలేవు. కానివ్వండి. అలాగే కానివ్వండి.
మీ ఎత్తు తెలిపింది ఆన్ లైన్ గాలి!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :