Sunday, January 19, 2025
Homeసినిమాసిరివెన్నెల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సిరివెన్నెల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల శాస్త్రి మృతిపట్ల ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు, సినీ, సాహిత్యాభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందర రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ సిఎం వైఎస్ జగన్, తెలంగాణ సిఎం కెసియార్, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, తెలుగు రాష్ట్రాల మంత్రులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

తెలుగు పాటకు సాహితీ వన్నెలద్దిన మహనీయుడు సిరివెన్నెల, అయన  అభిమానుల్లో నేనూ ఒకడిని – ఎం. వెంకయ్య నాయుడు

సిరివెన్నెల మరణం ఎంతో బాధించింది. అయన రచనల్లో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది, తెలుగు భాష ప్రాచుర్యానికి సిరివెన్నెల కృషి చేశారు – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులే –  ఏపీ సిఎం జగన్

సిరివెన్నెల అద్భుత సాహిత్యాన్ని సృష్టించారు – తెలంగాణ సిఎం కేసియార్

సీతారామ శాస్త్రి తన పాటలతో ప్రజల హృదయాల్లో చిరస్తాయిగా నిలుస్తారు– చంద్రబాబు నాయుడు

సిరివెన్నెల చరిత్రలో గుర్తుండిపోయే  పాటలు రాశారు. పాటల ద్వారా సమాజంలో చైతన్యం నిలిపారు- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సిరివెన్నెల రాసిన ప్రతి పాత ఆణిముత్యం – తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

సిరివెన్నెల కలం నుంచి జాలువారిన గీతాలు…  ఆణిముత్యాలు – నారా లోకేష్

సాహిత్యానికి ఇది చీకటి రోజు, తెలుగు సినీ పరిశ్రమ ఆత్మీయుడిని కోల్పోయింది –  చిరంజీవి

సాహితీ శిఖరం నేలకొరిగింది – మోహన్ బాబు

తెలుగు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించారు – నందమూరి బాలకృష్ణ

సిరివెన్నెల ఇక లేరనే వాస్తవం జీర్నిన్చుకోలేనిది, బలమైన భావాన్ని, మానవతా తత్వాన్ని, ఆశావాదాన్ని, చిన్న చిన్న మాటల్లో పొదిగి ప్రజల గుండెల్లో నిక్షిప్తం చేశారు – పవన్ కళ్యాన్

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ అయన పాత గుర్తుంచుకుంటారు – రాం గోపాల్ వర్మ

సినీ పరిశ్రమ గొప్ప రచయితను కోల్పోయింది – రాఘవేంద్ర రావు

జగమంత కుటుంబం మీది, మీరు లేక ఏకాకి జీవితం మాది – ప్రకాష్ రాజ్

సిరివెన్నెల రాసిన అక్షరాలు  చిరస్మరణీయం – జూనియర్ ఎన్టీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్