Saturday, March 14, 2026
Homeసినిమా'సైంధవ్' ఈవెంటులో తగ్గని వెంకటేశ్ జోరు!

‘సైంధవ్’ ఈవెంటులో తగ్గని వెంకటేశ్ జోరు!

వెంకటేశ్ ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే, తనని తాను మార్చుకుంటూ .. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండును అందుకుంటూ ఆయన ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది హీరోలు రీమేకులపై దృష్టి పెడుతున్నారు. కానీ తన కెరియర్ ఆరంభంలోనే ఆయన రీమేకులు చేస్తూ వెళ్లారు. అలా రీమేకుల నుంచి కూడా ఎక్కువ సక్సెస్ లను అందుకున్న హీరోగా ఆయనకి ఒక రికార్డు ఉంది.

ఇక ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి స్టార్స్ ముందుకు వస్తున్నారు. కానీ వెంకటేశ్ తన స్టార్ డమ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూనే, పవన్ కల్యాణ్ … మహేశ్ బాబు .. నాగచైతన్య వంటి హీరోలతో మల్టీ స్టారర్ చేస్తూ వెళుతున్నారు. వెంకటేశ్ తన సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఎప్పుడూ పాల్గొంటూనే వస్తున్నారు. అయితే ఈ మధ్య ప్రమోషన్స్ లోను ఆయన మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఆడియన్స్ తో చాలా సరదాగా మాట్లాడుతూ వారిని కలుపుకు పోతున్నారు.

‘సైంధవ్’ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజ్ లకు వెళ్లిన ఆయన అక్కడ వారితో సమానంగా అల్లరి చేశారు. అలాగే నిన్న రాత్రి ‘వైజాగ్’ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను సందడి చేశారు. అన్నయ్యలు .. తమ్ముళ్లు .. అక్కయ్యలు .. చెల్లెళ్లు .. వదినలు .. బామ్మలు అంతా ఈ సినిమా చూడాలని ఒక కొత్త హీరో మాదిరిగా రిక్వెస్ట్ చేస్తూ అందరినీ నవ్వించారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతూ వెళ్లడం వెంకటేశ్ ప్రత్యేకతగానే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular