Saturday, March 14, 2026
HomeసినిమాBichagadu-2: 'బిచ్చగాడు 2' మరో బ్లాక్ బస్టర్ - విజయ్ ఆంటోనీ

Bichagadu-2: ‘బిచ్చగాడు 2’ మరో బ్లాక్ బస్టర్ – విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ తో వస్తున్నాడు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ” పిలవగానే వచ్చిన గెస్ట్‌ లందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మా సినిమాను విడుదల చేస్తున్న విజయ్ గారూ థ్యాంక్యూ సో మచ్. హీరోయిన్ కావ్యే నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది. తనకు థ్యాంక్యూ. ఇండస్ట్రీలో మొదటి నుంచీ నన్ను సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను. బిచ్చగాడు తర్వాత మరో బిగ్ బ్లాక్ బస్టర్ వస్తోంది. పార్ట్ ఒన్ లో చూసిన దానికంటే లార్జర్ స్కేల్ లో సెకండ్ పార్ట్ లో చూస్తారు. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు. ఈ 19న మీరంతా ఫ్యామిలీస్ తో వచ్చి థియేటర్స్ లో సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ” అన్నారు..

నిర్మాత ఫాతిమా ఆంటోనీ మాట్లాడుతూ …. బిచ్చగాడు సినిమాను మీరు ఎంతో ఆదరించారు బిచ్చగాడు 2 అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది ఈ నెల 19 న థియేటర్ లలో వస్తుంది అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular