Friday, March 20, 2026
Homeసినిమాయథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన 'హత్య'

యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ‘హత్య’

సినిమాలకి సంబంధించినంత వరకూ కొన్ని కథలు జీవితాలకు దగ్గరగా అనిపిస్తాయి. మరికొన్ని కథలు జీవితాల్లో నుంచి పుట్టుకొస్తాయి. అలా యథార్థ సంఘటన ఆధారంగా ‘హత్య’ రూపొందినట్టుగా   చెబుతున్నారు. విజయ్ ఆంటోని హీరోగా ఈ సినిమా నిర్మితమైంది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. టైటిల్ తోనే కాదు .. విజయ్ ఆంటోని లుక్ పరంగా కూడా ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది.

చాలా కాలం క్రితం జరిగిన ఒక హత్యను .. దాని విచారణ జరిగిన తీరును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ ను చూస్తే, ఒక మోడల్ హత్య కేసులోని మిస్టరీని ఛేదించడానికి హీరో రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతోంది. ఆ యువతి తాళం వేయబడిన తన బంగ్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంది. ఎలాంటి ఆధారాలు కనిపించవు .. పోలీసులకు ఎలాంటి క్లూ దొరకదు. అప్పుడు హీరోకి ఈ కేసును అప్పగించడం జరుగుతుంది.

నిజానికి గతంలో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ఇది వాస్తవంగా జరిగిన సంఘటన కారణంగా .. ఈ కథలోని ఒక ట్విస్ట్ కారణంగా .. విజయ్ ఆంటోనీ మార్క్ యాక్షన్ కారణంగా కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితిక సింగ్ – మీనాక్షి చౌదరి .. రాధిక ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు 2’తో హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ, ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular