Sunday, January 19, 2025
Homeసినిమా'విక్రమ్ రాథోడ్' విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ రిలీజ్!

‘విక్రమ్ రాథోడ్’ విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ రిలీజ్!

విజయ్ ఆంటోనీ. విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన, రీసెంట్ గానే ‘బిచ్చగాడు 2’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా ‘విక్రమ్ రాథోడ్’ సినిమా తెలుగులో రాబోతోంది.

అపోలో ప్రొడక్షన్స్ – ఎస్ ఎన్ ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో నిర్మితమైన ఈ సినిమాకు, బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి – కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ముఖంపై గాయాలతో విజయ్ ఆంటోని కనిపిస్తున్నారు. సీరియస్ లుక్ లో ఆయన కనిపిస్తుండటం, ఎవరో రివాల్వర్ తో ఆయనకు గురిపెట్టడం చూపిస్తూ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించారు. శ్రీ శివగంగ ఎంటర్‌ ప్రైజెస్ వారు ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత, యోగిబాబు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్