Sunday, January 19, 2025
Homeసినిమాయాక్షన్ మాత్రమే తెలిసిన 'బీస్ట్'  

యాక్షన్ మాత్రమే తెలిసిన ‘బీస్ట్’  

Beast-Not a Feast: తమిళనాట విజయ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే అక్కడి థియేటర్ల దగ్గర వాతావరణమే మారిపోతుంది. మాస్ ఆడియన్స్ లో ఆయన కి ఉన్న క్రేజ్ ను గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు.’మాస్టర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత ఆయన నుంచి వచ్చిన భారీ బడ్జెట్ సినిమానే ‘బీస్ట్‘. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

నెల్సన్ కి ఇది మూడో సినిమా మాత్రమే. ఇంతకుముందు తమిళంలో ఆయన నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన ‘కొలమావు కోకిల’కి దర్శకత్వం వహించగా, అది సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన ‘డాక్టర్’ 100 కోట్లను వసూలు చేసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా యాక్షన్ తో ఏ మాత్రం పనిలేని సినిమాలే. అలాంటిది ‘బీస్ట్’ వంటి యాక్షన్ సినిమాను నెల్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్లందరికీ షాక్ ఇస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఆయన అదరగొట్టేశాడు. కాకపోతే కథను రొమాన్స్ కి దూరంగా తీసుకుని వెళ్లాడు.

విజయ్ సినిమా అంటేనే మాస్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ యాక్షన్ కి కాస్త కామెడీ టచ్ ఉంటుంది. రొమాన్స్ తో కూడిన డాన్సులతో ఆయన దుమ్మురేపేస్తాడు. అయితే ఈ సినిమాలో హీరో .. హీరోయిన్లు ఇద్దరూ కూడా తీవ్రవాదుల చేతిలో చిక్కడం వలన, వాళ్ల మధ్య పాటలు లేకుండా పోయాయి. పూజ హెగ్డే లాంటి హీరోయిన్ ను పెట్టుకుని విజయ్ రొమాన్స్ చేయలేదంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఈ విషయంలోనే వాళ్లు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. అరబిక్ కుతు పాటతోనే సరిపెట్టుకుంటున్నారు.

Also Read : ఇటు విజయ్ .. అటు యశ్ బిగ్ ఫైట్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్