Sunday, March 15, 2026
HomeసినిమాVijay Devarakonda: లైనప్ మామూలుగా లేదుగా!

Vijay Devarakonda: లైనప్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘లైగర్’ డిజాస్టర్ తో బాగా డీలాపడ్డాడు. ఆ తర్వాత నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత అతనికి జంటగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. విన్న వెంటనే ఈ పాట జనాలకు నచ్చేసింది. అలాగే ఈ పాటతో సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

‘ఖుషి’ తర్వాత చేయనున్న సినిమాలను ఒక్కొక్కటి అనౌన్స్ చేస్తున్నాడు. ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ తో ఓ సినిమాను ప్రకటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  ఈ సినిమా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుందని సమాచారం. దీనితో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న మూవీని ఆల్రెడీ స్టార్ట్ చేశారు.

ఇప్పుడు మరో మూవీకి కూడా విజయ్ ఓకే చెప్పాడట. అది ఎవరితో అంటే.. శ్యామ్ సింగ రాయ్ మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తో అని తెలిసింది. ఇది ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని టాక్.

మొత్తానికి లైగర్ డిజాస్టర్ నుంచి బయటపడ్డ విజయ్ ఇక ముందు చేసే సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకుని మంచి కథలను ఎంచుకుంటున్నాడు. మరి.. ఖుషి సినిమాతో విజయ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular