Thursday, March 19, 2026
Homeసినిమా సమంతకు బర్త్ డే సర్ ప్రైజ్

 సమంతకు బర్త్ డే సర్ ప్రైజ్

VD11 Movie gift: స్టార్ హీరోయిన్ సమంతకు మర్చిపోలేని విధంగా బర్త్ డే విశెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా సమంత బర్త్ డే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్లు టీమ్ అంతా నటించారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది.
కెమెరా రోల్ అవుతూ హీరో హీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో హ్యాపీ బర్త్ డే సమంత అని విజయ్ చెప్పడంతో సమంత ఆశ్చర్యపోయింది. టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. షూట్ లో ఉన్న వెన్నెల కిషోర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, ఇతర టీమ్ మెంబర్స్ సామ్ తో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular