Friday, October 18, 2024
Homeసినిమావిజయ్ దేవరకొండ సినిమా స్టోరీ ఇదే.?

విజయ్ దేవరకొండ సినిమా స్టోరీ ఇదే.?

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ కు జంటగా సమంత నటిస్తుంది. ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఇటీవల పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా ప్రారంభించాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఆ కథ ఏంటంటే… ఈ చిత్రంలో విజయ్ కు జంటగా మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. ఈ సినిమాలో మృణాల్ ఓ డాక్యుమెంటరీ వర్క్ మీద అమెరికా నుంచి ఇండియాకు వస్తుందట. ఇక్కడ హీరోకి, హీరోయిన్ కు పరిచయం అవుతుందట. అక్కడి నుంచి వీళ్ల ల‌వ్ స్టోరీ మొద‌ల‌వుతుంది. హీరో క్యారెక్ట‌ర్ ఏమో… నిరుద్యోగి. ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో ఉంటూ, అమెరికా వెళ్లాల‌ని క‌ల‌లు కంటుంటాడట. వీరిద్ద‌రి ప్ర‌యాణ‌మే ఈ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా కాదా అనేది తెలియాల్సివుంది.

ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్, కుటుంబ‌రావు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే హీరోకి.. త‌న ల‌వ్ స్టోరీకీ మ‌ధ్య ఉండే స్ట్ర‌గుల్ ఈ సినిమా అని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్‌ పైకి తీసుకెళ్ల‌నున్నారు. పరశురామ్ ఫ్యామిలీ స్టోరీస్ ని బాగా డీల్ చేయగలడు. అలాగే డైలాగ్స్ బాగా రాస్తాడనే పేరుంది. ఈ కథ అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా డిఫరెంట్ గా ఉంటుందట. గీత గోవిందం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఆరంభం నుంచి అంచనాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్