Saturday, January 18, 2025
Homeసినిమావిజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం!

విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం!

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

విజయ్ – రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లోని ఈ సినిమాను, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా దీనిని గురించి చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజాగా వినిపిస్తున్న టాక్. అదే నిజమైతే .. ఆయన ద్విపాత్రాభినయం చేసే ఫస్టు మూవీ ఇదే అవుతుంది. బడ్జెట్ పరంగా .. ద్విపాత్రభినయం పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోనుంది.

గతంలో విజయ్ – రాహుల్ కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’ భారీ విజయాన్ని అందుకున్న కారణంగా, ఈ ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ఇక ఈ ప్రాజెక్టు తరువాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనున్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్