Saturday, January 18, 2025
Homeసినిమావిజ‌య్, త్రివిక్ర‌మ్ కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

విజ‌య్, త్రివిక్ర‌మ్ కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ లైగ‌ర్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. దీంతో ఇక నుంచి చేసే సినిమాల క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకోవాల‌ని ఫిక్స్ అయ్యాడు. ప్ర‌స్తుతం శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో ‘ఖుషి’లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు మేక‌ర్స్. ఈ మూవీపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు విజ‌య్.

ఇదిలా ఉంటే… విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. విష‌యం ఏమిటంటే.. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించరు. కేవలం కథ మాత్రమే ఇస్తారట‌. దర్శకత్వ బాధ్యతల్ని మరొకరికి అప్పగించాలి. విజయ్‌ మాత్రం.. త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేస్తేనే ఈ సినిమా చేస్తాన‌ని అంటున్నాడట. విజయ్‌కు ఇప్పుడు ఓ సాలిడ్‌ హిట్‌ కావాలి. మంచి కథల కోసం విజయ్‌ అన్వేషిస్తున్నాడు.

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించకపోయినా, ఆయన కథతో సినిమా అంటే… త్రివిక్రమ్‌ సపోర్ట్‌ ఎలానూ ఉండనే ఉంటుంది. భీమ్లా నాయక్ చిత్రానికి దర్శకుడు సాగర్‌ చంద్రనే అయినా, వెనుక ఉండి అంతా నడిపించింది మాత్రం త్రివిక్రమే అని అంద‌రికీ తెలిసిందే. అలా.. ఈ కాంబోని త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తే – ఖ‌చ్చితంగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతుంది. విజ‌య్ కి కావాల్సిన స‌క్సెస్ వ‌స్తుంది. మ‌రి.. విజ‌య్ త్రివిక్ర‌మ్ స్టోరీతో సినిమా చేయ‌డానికి ఓకే చెబుతారో లేదో చూడాలి.

Also Read : టెన్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్