Sunday, January 19, 2025
Homeసినిమాక‌మ‌ల్ డైరెక్ట‌ర్ తో సినిమాపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఆసక్తి ?

క‌మ‌ల్ డైరెక్ట‌ర్ తో సినిమాపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఆసక్తి ?

సెన్సేష‌న‌ల్ హీరో విజయ్ దేవరకొండ- డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్  కాంబినేషన్లో  రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్’.  బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఆగ‌ష్టు 25న విడుదల కానున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ త‌ర్వాత కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లోనే మూవీ చేయ‌నున్నారు. అదే జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇది పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీని వ‌చ్చే సంవ‌త్స‌రం ఆగ‌ష్టులో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో విజ‌య్ నెక్ట్స్ మూవీస్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

లోకేశ్ కనగరాజ్ గురించి విన్నాను. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన విక్రమ్ సినిమాను చూశాను. ఆ సినిమాను చూస్తూ నన్ను నేను మరిచిపోయాను. మొదటి నుంచి చివరి వరకూ ఆ సినిమా అలా కూర్చోబెట్టేసింది. లోకేశ్ కనగరాజ్ ఆ సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. అందువల్లనే దానికి ఆ స్థాయి ఆదరణ లభించింది. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. త్వరలోనే ఆయన నుంచి నాకు కాల్ వస్తుందని అనుకుంటున్నాను అన్నారు. మ‌రి.. విజ‌య్, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్ త్వ‌ర‌లోనే సెట్ అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్