Saturday, January 18, 2025
Homeసినిమాసినిమాను ఎవరు ఆపుతారో చూస్తా? - విజయ్ దేవరకొండ

సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా? – విజయ్ దేవరకొండ

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లైగర్ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో గాయంతో బ్యాక్ పెయిన్ ఉన్నా… సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘సినిమా కోసం ఇంత కష్ట పడ్డాం.. ఇప్పుడు రిలాక్స్ అయితే ఎలా’ అని ఇటీవల హైదరాబాద్ ప్రెస్ మీట్ లో విజయ్ చెప్పడం సినిమా మీద ప్యాషన్, ప్రమోషన్స్ మీద ఆయనకున్న కమిట్మెంట్ చూపిస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఆయన క్రేజ్ కనిపిస్తోంది. చాలా చోట్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ అవుతున్నాయి.

సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో మిగతా అందరు స్టార్స్ సినిమాల్లాగే బాయ్ కాట్ లైగర్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. బాయ్ కాట్ లైగర్ పై ఇవాళ ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో మరోసారి గట్టిగా స్పందించారు విజయ్ దేవరకొండ. ఆయన మాట్లాడుతూ… “నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది. ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నాయి. దేవుడి కృప ఉంది. గెలవాలనే ఫైర్ లోపల ఉంది. ఇక మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా” అంటూ బలమైన కౌంటర్ ఇచ్చారు.

Also Read : వెంటాడే మాటలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్